చేతిలో శూలం.. పరమశివుడి భక్తిలో లీనమైన నితిన్ హీరోయిన్.. పిక్స్ వైరల్

by Anjali |   ( Updated:2025-02-25 06:47:33.0  )
చేతిలో శూలం.. పరమశివుడి భక్తిలో లీనమైన నితిన్ హీరోయిన్.. పిక్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ఆదా శర్మ(Adah Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. హార్ట్ అటాక్ (Heart attack) సినిమాలో ముందుగా అవకాశం దక్కించుకుంది. ఈ రొమాంటిక్ చిత్రానికి పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో నితిన్ (Nithin) హీరోగా నటించాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 2014 లో థియేటర్లలో గ్రాండ్ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (Subramaniam for sale), సన్నాఫ్ సత్యమూర్తి (Son of Satyamurthy) వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల వద్ద మంచి పేరు సంపాదించుకుంది. ఈ చిత్రాలు ఆదా శర్మకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ముఖ్యంగా ఆదా శర్మ ది కేరళ స్టోరీ (The Kerala Story) చిత్రంతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో వశ్వంత్ కీలక పాత్రలో కనిపించాడు. బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ (Psychological suspense thriller) చిత్రానికి కృష్ణ అన్నం రూపొందించారు. ఈ మూవీ విడుదలయ్యాక దాదాపు 5 నెలల తర్వా త ఓటీటీలోకి వచ్చింది. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. చేతిలో శూలం పట్టుకుని దర్శనమిచ్చింది. శంకం ఊదుతోన్న పిక్స్ అభిమానులతో పంచుకుని.. ‘హరహర మహాదేవ’ అంటూ ఈ పోస్ట్ కు క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. పరమశివుడి భక్తిలో లీనమైన నితిన్ హీరోయిన్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed