నటుడు నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
నటుడు నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: నటుడు నందమూరి బాలకృష్ణ(Actor Nandamuri Balakrishna) కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిలో తలసేమియా బాధిత(Thalassemia Sufferers) చిన్నారుల చికిత్స కోసం ఎనిమిది పడకల కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్(NTR Trust) ఆధ్వర్యంలో ఇప్పటికే 250 మంది తలసేమియా బాధిత చిన్నారులకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం ఆసుపత్రి, విద్యాలయాల ద్వారా సమాజానికి తమవంతు సేవ చేస్తున్నట్లు చెప్పారు. తలసేమియా చిన్నారులు జీవితాంతం రక్తమార్పిడిపై ఆధారపడాల్సి వస్తుందని.. హైదరాబాద్‌లో మొత్తం 3500 మంది తలసేమియా బాధిత చిన్నారులు ఉన్నారని అన్నారు.

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం(Vijayawada Indira Gandhi Stadium)లో ‘యూఫోరియా మ్యూజికల్ నైట్‌’ (Euphoria Musical Night) ఈవెంట్‌లో బాలకృష్ణ పాల్గొన్నారు. ఆయనతో పాటు సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), మంత్రి నారా లోకేష్(Nara Lokesh), నారా, నందమూరి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు రూ.50లక్షలు విరాళం ప్రకటించారు. దీంతో సీఎం చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ.. పవన్ కల్యాణ్‌ను అభినందించారు.

Next Story

Most Viewed