అల్లు అరవింద్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన నేచురల్ బ్యూటీ.. వీడియో వైరల్

by Kavitha |
అల్లు అరవింద్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన నేచురల్ బ్యూటీ.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ప్రేమమ్’(Premam) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆ అమ్మడు.. తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాత ‘ఫిదా’(Fidaa) సినిమాలో నటించి మెప్పించింది. అంతే కాకుండా తన యాక్టింగ్‌తో అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా రీసెంట్‌గా ‘అమరన్’(amaran) మూవీతో మంచి విజయం సాధించింది. ఇక తాజాగా నాగ చైతన్య(Naga chaitanya), చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో వచ్చిన ‘తండేల్’(Thandel) సినిమాలో కూడా నటించి అలరించింది.

తన యాక్టింగ్‌తో ఆడియన్స్‌ నుంచి ఫుల్ మార్కులే కొట్టేసింది. లవర్స్ డే కానుకగా అల్లు అరవింద్ (Allu aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అంతేకాకుండా నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ వసూళ్లు రాబడుతున్న సినిమాగా తండేల్ నిలుస్తోంది. అయితే ఈ మూవీ ఇంతటి భారీ విజయం సాధించడంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

తాజాగా ఈ సినిమా టీమ్ శ్రీకాకుళంలో సందడి చేసింది. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన వేడుకలో చిత్రయూనిట్ పాల్గొంది. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. ఇక వేదికపై హైలెస్సో.. హైలెస్సా అంటూ సాగే పాటకు సాయి పల్లవితో కలిసి అల్లు అరవింద్ డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. గతంలోనూ తండేల్ మూవీ ఈవెంట్లలో సాయి పల్లవితో కలిసి స్టెప్పులేశారు అల్లు అరవింద్. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Next Story