Janasena: పవన్ కల్యాన్‌కు థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్.. స్పందించిన జనసేన కీలక నేత

by Gantepaka Srikanth |
Janasena: పవన్ కల్యాన్‌కు థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్.. స్పందించిన జనసేన కీలక నేత
X

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2(Pushpa-2) సక్సెస్ మీట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సినిమా టికెట్ల రేట్ల పెంపులో కీలక పాత్ర పోషించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు కృతజ్ఞతలు చెప్పారు. పర్సనల్‌గా ‘కల్యాణ్‌ బాబాయ్ థాంక్యూ సో మచ్’ అని అన్నారు. తాజాగా.. బన్నీ వ్యాఖ్యలపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ(Bolisetti Satyanarayana) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

‘పవన్ కల్యాణ్ గారిని అల్లు అర్జున్ గారు బాబాయ్ అని సంబోధించడానికి కారణం.. చిన్నప్పటి నుంచి సినిమా పరంగా చిరంజీవి గారిని తండ్రి లాగా, కళ్యాణ్ గారిని బాబాయిగా భావించడమే. చిరంజీవి గారు తెలుగు సినిమా పరిశ్రమలో తను ఒక శిఖరంలా ఎదగడమే కాకుండా, సినీ పరిశ్రమకి, మెగా కుటుంబానికి ఒక గాడ్ ఫాదర్‌గా నిలిచారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి పదవి నుండి వైఎస్ జగన్ దిగిపోవడంతో సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది’ అని బొలిశెట్టి సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.



Next Story

Most Viewed