Kantara: Chapter 1: చిక్కుల్లో ‘కాంతార’ మూవీ టీమ్.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు!

by sudharani |
Kantara: Chapter 1: చిక్కుల్లో ‘కాంతార’ మూవీ టీమ్.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు!
X

దిశ, సినిమా: 2022లో చిన్న సినిమాగా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న చిత్రం ‘కాంతార’ (Kantara). కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి (Rishabh Shetty) ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ (box office) వద్ద పెద్ద ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్‌ (Prequel)గా ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. అంతే కాకుండా తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా చిక్కుల్లో పడినట్లు తెలుస్తుంది.

అయితే.. గ్రామ శివార్లలోని ఖాళీ మైదానాల్లో ఈ మూవీ షూటింగ్ (Shooting) చేసుకునేందుకు అధికారులు (Officers) అనుమరి ఇచ్చారు. కానీ చిత్ర బృందం మాత్రం అక్రమంగా అటవీ ప్రాంతంలో షూట్ చేస్తుందని, అంతేకాకుండా పేలుడు పదార్థాలు కూడా ఉపయోగిస్తుందని అక్కడ ప్రాంత ప్రజలు పోలీసుకులకు ఫిర్యాదు చేశారు. పేలుడు పదార్థాల కారణంగా అటవీ ప్రాంతంలో ఉండే మూగ జీవాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలుపుతూ స్థానికులు చిత్ర బృందాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తుండగా.. ఇరువర్గాల మధ్య వాగాద్వం జరిగి గ్రామానికి చెందిన ఓ యువకుడిపై చిత్ర బృందం దాడి చేసందని తెలిపారు. ఈ మేరకు స్థానికులంతా కలిసి యెసలూరు పోలీస్ స్టేషన్‌ (Police station)లో కేసు నమోదు చేశారు. పోలీసులు దీనిపై స్పందించి త్వరిగతిన తగు చర్యలు తీసుకోకపోతే తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని స్థానికులు తెలిపారు. మరి ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో వేచి చూడాల్సి ఉంది.

Next Story

Most Viewed