త్వరలో సినిమా థియేటర్లు ఓపెన్?

by Shamantha N |   ( Updated:2020-07-25 07:08:15.0  )
త్వరలో సినిమా థియేటర్లు ఓపెన్?
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా ప్రియులకు కేంద్రం శుభవార్త చెప్పింది. త్వరలోనే దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లను తిరిగి ప్రారంభించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా సిఫారసు చేసింది. ఆ శాఖ కార్యదర్శి అమిత్ ఖరీ శనివారం సినిమా ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఆగస్ట్ 1 లేదా ఆగస్ట్ 31 దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ విషయంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫైనల్ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. థియేటర్లలో సామాజిక దూరం పాటించేలా సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించాలని తాము సూచించామని ఆయన అన్నారు.

Advertisement

Next Story