కొత్త హీరోయిన్‌తో ప్రముఖ నిర్మాత ‘7 డేస్ 6 నైట్స్’

by Shyam |
Cinema-poster-7-days-6-nigh
X

దిశ, సినిమా : టాలీవుడ్‌లో ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన నిర్మాత ఎంఎస్ రాజు.. ‘డర్టీ హరి’ సినిమాతో డైరెక్టర్ అవతారమెత్తారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న సినిమాలో మెహర్ చావల్ హీరోయిన్‌గా పరిచయం కాబోతుండగా.. ఈ రోజు(గురువారం) సినిమా పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్. యూత్‌ఫుల్ కంటెంట్‌తో నిర్మిస్తున్న సినిమాలో పాటలకు, నేపథ్య సంగీతానికి మంచి స్కోప్ ఉందని, ఈ కథ సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుందని హీరో సుమంత్ తెలిపాడు.

ఇక దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. ‘డర్టీ హరి’ వంటి హిట్ తర్వాత మళ్లీ అదే తరహా సినిమా చేస్తానని అందరూ ఊహించి ఉంటారన్నారు. కానీ, ‘7 డేస్ 6 నైట్స్’ అందుకు భిన్నంగా ఉంటుందని.. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, విజువల్స్, మ్యూజిక్ ఈ చిత్రాన్ని డామినేట్ చేస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమాకు సమర్థ్ గొల్లపూడి మ్యూజిక్, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

Advertisement

Next Story