సినిమా హాళ్లు బంద్.. ‘వకీల్ సాబ్’ కాదు

by Shyam |   ( Updated:2021-04-20 08:22:46.0  )
సినిమా హాళ్లు బంద్.. ‘వకీల్ సాబ్’ కాదు
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్న దృష్ట్యా మంగళవారం రాత్రి 8గంటల నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి వస్తున్న విషయం తెలిసిందే. అయితే, కర్ఫ్యూ విధించిన క్రమంలో థియేటర్ల వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుందని భావించిన సినిమా యజమానుల అసోసియేషన్ సినిమా హాళ్లను మూసివేయాలని నిర్ణయించాయి. దీంతో తెలంగాణ వ్యా్ప్తంగా ఉన్న థియేటర్లు మరోసారి మూతబడ నున్నాయి. అయితే, మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్‌గా ఎంట్రీ ఇచ్చిన ‘వకీల్ సాబ్’ మూవీ నడుస్తున్న థియేటర్లలో మాత్రం టైమింగ్ కొద్దిగా ముందుకు జరిపి రాత్రి 8గంటలలోపు మూడు షోలు నడిచేలా యజమాన్యాలు ప్లాన్ చేశాయి.

దీని ప్రకారం పవన్ సినిమాకు కర్ఫ్యూ ఏ మాత్రం అడ్డంకి కాదు. పవన్ అభిమానులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు లభించినట్లు అయింది. పవన్ సినిమా నడుస్తున్న థియేటర్లు మినహా మిగతావి మాత్రం మే 1వ తేదీవరకు మూసివేసి ఉంటాయి. సినిమా ప్రదర్శన సమయాన్ని ముందుకు జరిపి ప్రతీ షో అనంతరం సినిమా హాల్లో శానిటైజ్ చేయనున్నట్లు థియేటర్ల అసోసియేషన్ ప్రకటించింది.

Advertisement

Next Story