శ్రీశైలం ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు

by Anukaran |
శ్రీశైలం ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు
X

దిశ, వెబ్‌‌డెస్క్: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్ర అగ్నిప్రమాదంపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్, డీఐజీ సుమతీ నేతృత్వంలో ఘటనా స్థలికి మొదటి రోజు 25 మంది సీఐడీ బృందం తనిఖీ చేసింది. సీఈ, డీఈ, ఈఈ స్థాయి అధికారులతో సీఐడీ బృందం భేటీ అయింది. ప్రమాదానికి కారణమైన పరిస్థితులను ఆరా తీశారు. అనంతరం భూగర్భంలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బృంద సభ్యులు పరిశీలించారు. ఎలక్ట్రిక్, ఫోరెన్సిక్, లోకల్ పోలీసులు ఘటనా స్థలాన్ని క్షుణంగా పరిశీలించారు.

Advertisement

Next Story

Most Viewed