మాజీ మంత్రి నారాయణకు టెన్షన్ టెన్షన్ 

by Anukaran |   ( Updated:2021-03-17 02:22:23.0  )
మాజీ మంత్రి నారాయణకు టెన్షన్ టెన్షన్ 
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేతలకు టెన్షన్ మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు పలువురు నేతలకు సీఐడీ నోటీసులు అందాయి. దీంతో ఎప్పుడు ఎవరి ఇంటిపై అధికారులు దాడి చేస్తారో అని పార్టీ నేతలంతా కంటి మీద కునుకు లేకుండా కలవరపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకు మంగళవారం నోటీసులు అందించిన అధికారులు బుధవారం ఆయన ఇళ్ళు, కార్యాలయాల్లో సోదాలు మొదలుపెట్టారు.

కూకట్‌పల్లి లోధా బెల్లేజలో ఉంటున్న నారాయణ ఇంటిలో 41(A) సి.ఆర్.పి.సి ప్రకారం సీఐడీ అధికారులు మంగళవారం నోటీసులు ఇచ్చారు. నారాయణ అందుబాటులో లేకపోవటంతో, అతని భార్య రమాదేవికి నోటీసులు అందజేశారు. మార్చి 22వ తేదీన విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరవ్వాలంటూ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.

కాగా, బుధవారం ఉదయం నుండి నారాయణ ఇంటిపై సీఐడీ అధికారులు దాడులు ప్రారంభించారు. హైదరాబాద్, నెల్లూరు, విజయవాడలో సీఐడీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం పదిచోట్ల దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నారాయణకు సంబంధించిన ఇళ్ళు, కార్యాలయాల్లో ఈ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. ఆయన బంధువుల ఇళ్లల్లో కూడా సీఐడీ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయనతోపాటు ఆయన కుటుంబసభ్యుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed