- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాలిబన్లతో అమెరికా సీక్రెట్ మీటింగ్.. అసలేం జరిగింది ?
కాబుల్: తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘని బరాదర్‌తో అమెరికా సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) చీఫ్ విలియం బర్న్స్ సోమవారం రహస్యంగా సమావేశమైనట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని యూఎస్‌కు మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్ట్ మంగళవారం వెల్లడించింది. ఇదే గనుక నిజమైతే, ఆఫ్ఘాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత యూఎస్‌కు తాలిబన్లకు మధ్య జరిగిన తొలి అత్యున్నత స్థాయి సమావేశం ఇదే కానుంది. ఆఫ్ఘాన్ నుంచి యూఎస్ బలగాల ఉపసంహరణను కొద్ది రోజులపాటు వాయిదా వేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మిత్ర దేశాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. పరిస్థితులు సద్దుమణిగే వరకు అక్కడే ఉండాలని కోరుతున్నాయి.
దీనిపై చర్చించేందుకే అపార అనుభవం కలిగిన రాయబారి విలియం బర్న్స్, తాలిబన్లతో రహస్యంగా సమావేశమైనట్టు సదరు మీడియా సంస్థ పేర్కొంది. అయితే, దీనిపై అటు సీఐఏ నుంచి గానీ, ఇటు తాలిబన్ల నుంచి గానీ అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, ముందుగా చెప్పిన గడువులోగా యూఎస్ బలగాల ఉపసంహరణ పూర్తికాకపోతే తీవ్ర పరిణామాలుంటాయని తాలిబన్ల ప్రతినిధి సుహైల్ షాహిన్ సోమవారం హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆఫ్ఘాన్ నుంచి తమ బలగాలను ఈ నెల 31లోపు పూర్తిస్థాయిలో వెనక్కి రప్పిస్తామని యూఎస్ అధ్యక్షుడు బైడెన్ గతంలోనే ప్రకటించారు.