మాచర్ల ఘటన: సీఐపై వేటు

by srinivas |   ( Updated:2020-03-15 07:08:23.0  )
మాచర్ల ఘటన: సీఐపై వేటు
X

మాచర్లలో టీడీపీ నేతలపై దాడి ఘటనలో సీఐను బాధ్యుడిని చేస్తూ సస్పెన్షన్ వేటు పడింది. దాడిలో పాల్గొన్న నిందితుడు తురక కిషోర్‌కు స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు రావడంతో పోలీస్ ఉన్నతాధికారాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తురకా కిషోర్‌కు ఏకంగా మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి దక్కనున్నట్లు సమాచారం. చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వుకావడం, అదే సామాజికవర్గానికి చెందిన కిషోర్ గురువారం 13 వార్డు కౌన్సిలర్‌గా నామినేషన్ దాఖలు చేశాడు. దాడి కేసులో పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ బెయిలబుల్‌ కేసు నమోదు చేసిన పోలీసులు, 41ఎ నోటీసు ఇచ్చి స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేశారు. ఒంటరిగా వెళ్లి నామినేషన్‌ వేసిన కిశోర్‌, అనంతరం స్టేషన్‌కు వచ్చిన తర్వాత 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌‌కు తరలించారు.

tag; macherla incident, ci suspend, ap news

Advertisement

Next Story

Most Viewed