- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసు ఉద్యోగం అంటే చాలా ఇష్టం
దిశ ప్రతినిధి, మెదక్: ప్రభుత్వ ఉద్యోగం.. ఈ పేరు వినగానే చాలా మందిలో ఒక రకమైన సంతోషం కలుగుతుంది. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాన్ని తమ కుటుంబ పోషణ కోసం చేస్తూంటారు. మరికొందరు వృత్తిపై ఫ్యాషన్‌తో చేస్తారు. ఉద్యోగంపై ఉన్న ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో రకంగా వ్యక్తపరుస్తుంటారు. కానీ, ఓ పోలీస్ అధికారి మాత్రం కాస్త వెరైటీగా ప్రయత్నించాడు. పోలీస్ ఉద్యోగంపై ఉన్న ప్రేమతో తన కార్యాలయంలోని నేమ్ బోర్డ్‌పై తన పేరు, ప్రొఫెషన్‌తో పాటు ‘‘ఐ లవ్ మై జాబ్’’ అంటూ పేరు పెట్టుకున్నాడు.
ఇంతకీ ఇది ఎక్కడ, ఆ పోలీస్ అధికారి ఎవరు అనుకుంటున్నారా..? ఎక్కడో కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా, మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలోనే. సిద్దిపేట వన్‌టౌన్ సీఐగా విధులు నిర్వహిస్తున్న బి.శ్రీనివాస్ తన నేమ్ బోర్డ్‌కు ఇలా పెట్టుకొని వృత్తిపట్ల ఇష్టాన్ని చాటుకున్నాడు. నిజానికి సీఐ శ్రీనివాస్ ఉద్యోగ రీత్యా సౌమ్యుడు. అందరితో కలుపుగోలుగా ఉంటాడు. ఈ సందర్భంగా ‘దిశ’ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ… చిన్నప్పటి నుండి పోలీసు కావాలనేది తన కల అని, అందుకోసం కష్టపడి జాబ్ సాధించానని తెలిపారు. ప్రస్తుతం వన్ టౌన్ సీఐగా విధులు నిర్వహిస్తున్నానని, సీపీ ఆదేశాల మేరకు తన దగ్గరకు వచ్చిన వారితో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ వారి సమస్యలు పరిష్కరించేందుకు పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.