- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సలామ్ పోలీసన్న.. అమ్మకు అండగా సీఐ శివరాంరెడ్డి
దిశ, కోదాడ: ‘‘అమ్మను రోడ్డున పడేసారు’’ అనే శీర్షికన ‘దిశ’ దిన పత్రికల్లో ప్రచురితమైన కథనానికి కోదాడ సీఐ శివరాం రెడ్డి స్పందించారు. ఆదివారం మండలంలోని అల్వాల్‌పురం గ్రామానికి వెళ్లి తల్లిని రోడ్డున పడేసిన భూతం శాంతమ్మ కుమారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం కాలు నొప్పితో బాధపడుతున్న వృద్ధురాలిని కోదాడ తిరుమల ఆస్పత్రికి స్వయంగా తీసుకెళ్లి చికిత్స చేయించారు. అంతేగాకుండా.. వైద్యానికి అయ్చే మొత్తం ఖర్చును తానే భరిస్తానని వైద్యులకు సూచించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆప్యాయంగా చూసుకోవాలని, ఎటువంటి కష్టం రాకుండా కాపాడుకోవాలని సూచించారు. నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీసుకోలేమన్నారు. తల్లిదండ్రులను ఇబ్బంది గురి చేస్తే వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, మానవత్వంతో వృద్ధురాలికి సహాయం చేసిన సీఐ శివరాంరెడ్డిని గ్రామస్తులు అభినందించారు.