ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. ఇన్‌స్టాలో వీడియో షేర్ చేసిన మోడల్

by Shyam |
ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. ఇన్‌స్టాలో వీడియో షేర్ చేసిన మోడల్
X

దిశ, ఫీచర్స్ : ముఖ సౌందర్యంలో కనుబొమ్మలే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అందమైన నయనాలకు అవే పెద్ద ఆస్తి. అయితే కొందరు మహిళలకు కనుబొమ్మలు పలుచగా ఉండటం వల్ల ప్రతీరోజు ఉదయం ఐబ్రోస్ మేకప్ కోసం అదనపు సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. కొంతకాలంగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఫారిన్ లేడీ.. ఆ బాధల నుంచి విముక్తి పొందేందుకు ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకుంది. వినడానికి వింతగానే ఉన్నా.. మోడల్, కుక్ బుక్ రైటర్ అయిన క్రిస్సీ టీజెన్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేసింది. అయితే, తను కొత్తగా మార్పిడి చేసుకున్న కనుబొమ్మల కోసం వెంట్రుకలను ఆమె తల వెనుక భాగంలోని జుట్టు నుంచి తీసుకోవడం విశేషం.

ఐబ్రో ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన 35 ఏళ్ల లేడీ.. ‘ఇకపై మేకప్ వేసుకునే అవసరం ఉండదు కాబట్టి ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను’ అనే క్యాప్షన్‌తో సర్జరీ తర్వాత తన ఫొటోను పోస్టు చేసింది. కాగా ఈ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ గురించి కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ ఎస్తటిక్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ తృప్తి అగర్వాల్‌ వివరించారు. ‘సహజంగా లేని జుట్టు, స్థిరమైన అలోపేసియా అరేటా, అలోపేసియా టోటాలిస్ అండ్ యూనివర్సాలిస్, మడారోసిస్, స్కార్స్ ఆఫ్ బర్న్ అండ్ ట్రామా, ట్రైకోటిల్లోమానియా, కనుబొమ్మల్లో హెచ్చుతగ్గులు’ వంటి సందర్భాల్లో ఈ సర్జరీ అవసరం. కనుబొమ్మల్లో జుట్టు పుట్టుకతోనే లేనటువంటి సందర్భాల్లోనూ అవసరమే’ అని తెలిపింది.

Advertisement

Next Story