- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జి‘గేల్’ @ థౌజండ్ వాలా
దిశ, వెబ్‌డెస్క్: క్రిస్ గేల్.. ఈ పేరు వినగానే బౌలర్ల గుండెల్లో వణుకుపుడుతుంది. ఎంతటి విపత్కర పరిస్థితుల్లో అయినా సులభంగా బ్యాటింగ్ చేస్తూ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాడు. అంతటి అద్భుతమైన ఆటగాడు గేల్ ఇప్పటికే ఎన్నో రికార్డులు గేల్ తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ప్రపంచ టీ20ల్లో గేల్ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో 1000 సిక్సులు బాదిన ఏకైక క్రికెటర్‌గా గేల్ చరిత్ర సృష్టించాడు. కేవలం సిక్సర్లతోనే ఆరువేల పరుగులు చేసి, ప్రపంచ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతేగాకుండా ఈ రికార్డును తిరగరాయడానికి దాని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. గేల్ తర్వాత రెండోస్థానంలో కీరన్ పొలార్డ్(690), మూడో స్థానంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాట్‌మెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ఉన్నాడు. కాగా 41 ఏళ్ల వయసున్న గేల్ కేవలం ఐపీఎల్‌లోనే 129 ఇన్నింగ్సుల్లో 341 సిక్సులు బాదాడు.