గచ్చిబౌలిలో కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత..

by Anukaran |
గచ్చిబౌలిలో కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత..
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ ఐటీ సెక్టార్ ప్రాంతంలో చిరుత సంచారం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాజాగా ఆదివారం ఉదయం రోడా మిస్త్రీ కాలేజీలోని పెంపుడు కుక్కను చిరుత ఎత్తుకెళ్లినట్లు సమాచారం. విషయం తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని అలెర్ట్ చేసినట్లు వెల్లడించారు.ప్రస్తుతం చిరుత కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story