- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సరుకులు సిద్ధం… దాతలకు చిరు కృతజ్ఞత
దిశ, వెబ్‌డెస్క్: కుటుంబ పెద్ద… ఆ కుటుంబ బాగోగులు చూసుకుంటాడు. వారి బాధలను తన బాధలుగా భావించి … ఆ కుటుంబ సభ్యుల అవసరాలు, ఆకలి తీరుస్తాడు. కష్ట కాలంలో చేయూతనిస్తూ … వారి ముఖంలో సంతోషాన్ని నింపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడు. అలాగే తెలుగు సినిమా కుటుంబానికి పెద్ద దిక్కుగా మారిన మెగాస్టార్ చిరంజీవి… కరోనా ఎఫెక్ట్‌తో సినీ కార్మికుల బాధలు, అవసరాలను గుర్తించి… వారి ఆకలిని తీర్చే ప్రయత్నం చేశాడు. ఇండస్ట్రీలో మరింత మంది పెద్దల సహకారంతో కరోనా క్రైసిస్ చారిటీని ఏర్పాటు చేసిన చిరు పెద్దమొత్తంలో విరాళాలు సేకరించారు. టాలీవుడ్ దిగ్గజ హీరోల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టు వరకు ప్రతీ ఒక్కరు ఇచ్చిన స్థూల, సూక్ష్మ విరాళాలను స్వీకరించి.. నిరుపేద కళాకారుల కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు.
The food supplies being distributed to the daily wage workers of film industry by #CoronaCrisisCharity are being handled with all due care and being door delivered to the needy. I thank everyone involved in this humanitarian mission. pic.twitter.com/ENgA2UEgZg
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 9, 2020
ఇప్పటి వరకు సేకరించిన మొత్తాన్ని కలిపి సరుకులను కొనుగోలు చేశామని తెలుపుతూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన చిరు.. కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా చలన చిత్ర పరిశ్రమకు చెందిన రోజువారీ వేతన కార్మికులకు పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులను అన్ని రకాల జాగ్రత్తలతో ప్యాక్ చేస్తున్నట్లు చెప్పారు. అవసరమైన వారికి డోర్ డెలివరీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ లక్ష్య సాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవీ.
Tags: Chiranjeevi, CCC, Corona Crisis Charity, Corona, CoronaVirus, Covid 19