బాలయ్య టాక్ షో.. మొదటి గెస్ట్ గా చిరంజీవి..?

by Anukaran |   ( Updated:2021-10-12 03:00:17.0  )
బాలయ్య టాక్ షో.. మొదటి గెస్ట్ గా చిరంజీవి..?
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ త్వరలోనే ఓటీటీలో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ దిగ్గజం ‘ఆహా’ తో కలిసి బాలయ్య ఒక టాక్ షోను నిర్వహించబోతున్నారు. ఇక ఈ షో కి ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. బాప్ షోలకే బాప్ షో అంటూ పోస్టర్ కూడా వదలడంతో ఈ షోపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రోమో కూడా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ షో కి మొదటి గెస్ట్ గా ఎవరు రానున్నారు..? అనేది అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. ఇప్పటికే కొంతమంది దర్శకుడు క్రిష్ అంటుండగా.. మరికొందరు దర్శకుడు గోపీచంద్ మలినేని అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక అయితే మొదటి ఎపిసోడ్ ని ‘ఆహా’ మాత్రం గ్రాండ్ గా ప్లాన్ చేస్తుందట.. దానికోసమే మొదటి ఎపిసోడ్ కోసం మెగాస్టార్ చిరంజీవిని రంగంలోనికి దించనున్నారట.

అల్లు అరవింద్, మెగాస్టార్ ని ఒప్పించి బాలయ్య టాక్ షో కి మొదటి గెస్ట్ గా ఆహ్వానించనున్నారని సమాచారం. ఇక ఈ షో లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మంచు ఫ్యామిలీ మొత్తం పాల్గొనున్నట్లు టాక్. వీరితో పాటు బాలయ్య దర్శకులు లేకుండా షో ముగియడం కష్టమే. మొత్తానికి బాలయ్య కోసం చిత్రపరిశ్రమ మొత్తం కదిలిరానుందని తెలుస్తోంది. ఇక వీరి మధ్య అనుంబంధాలను తెలిపే విధంగానే ప్రశ్నలు, గేమ్స్ ఉంటాయని సమాచారం. మరి ఇద్దరు స్టార్ హీరోలు ఒకే వేదికపై ఉంటే ఫ్యాన్స్ కి పండగే. ఎప్పుడెప్పుడు ఈ షో మొదలవుతుందో అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story