- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కష్టకాలంలో దర్శకుడు.. కూతురికి ఫీజు కట్టిన మెగాస్టార్
by Shyam |

X
దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా సమయంలో సినీకార్మికులను ఆదుకున్న ఆయన… తాజాగా దర్శకరత్న దాసరి నారాయణరావు గారి కోడైరెక్టర్ ప్రభాకర్ కుటుంబానికి అండగా నిలిచారు. ‘హెల్ప్ లైన్’ సినిమాతో నిర్మాతగా ప్రయోగం చేసి ఫెయిల్ అయిన తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నాడు. ఆయన కూతురి చదువు కోసం రెండున్నర లక్షల ఫీజు కట్టాడు. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ కూడా తనకు సాయం అందించాడని తెలిపిన ప్రభాకర్… మెగాస్టార్‌ను ‘గజేంద్రుడిని కాపాడిన మహావిష్ణువు’తో పోల్చాడు. చిరంజీవి సహాయానికి హ్యాట్సాఫ్ చెప్పిన ఆయన.. అందుకే సినిమా ఇండస్ట్రీ చిరును బాస్‌గా గౌరవిస్తుందన్నాడు. మెగాస్టార్ ‘లంకేశ్వరుడు’ చిత్రానికి కోడైరెక్టర్‌గా వర్క్ చేసినప్పుడు ఏ విధంగా ఆదరించారో.. ఇప్పుడు కూడా అంతే అభిమానంతో ఉన్నారని తెలిపాడు.
Next Story