- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైతుగా మారిన చిరంజీవి.. చాలా ఆనందంగా ఉందంటూ..
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి రైతుగా మారిపోయాడు. తన ఇంటి పెరట్లో కూరగాయలు పండిస్తున్నట్లు తెలిపిన చిరు.. లాక్ డౌన్ సమయంలో తాను పెట్టిన మొక్కకు కాసిన రెండు సొరకాయలను చూపిస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకోగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోను జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని షేర్ చేయగా.. ‘ఒక రైతు తన పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని ఇంటికి తీసుకువెళ్లేముందు ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడో.. అందులో ఎంతో కొంత ఆనందాన్ని ఈ రోజు నేను పొందుతున్నాన’ని చిరు అన్నాడు.
‘దానికి కారణం.. కొన్ని నెలల క్రితం మా పెరట్లో ఓ సోరకాయ విత్తనం నాటాను. అది పెద్ద పాదగా మారి రెండు కాయలు కాసింది. వాటిని ఈరోజు కోస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపాడు. ‘పెరట్లో ఆనపకాయ కాస్తేనే నాకు ఇంత సంతోషమనిపిస్తే, మట్టి నుంచి పంట పండించి, మనందరికీ అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి! అలా ఉండేలా మనమే చూసుకోవాలి. వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతుకు నా సెల్యూట్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన అభిమానులతోపాటు సెలబ్రిటీలు సైతం చిరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.