చిప్కో ఉద్యమ సారథి సుందర్‌లాల్ బహుగుణ కన్నుమూత

by Anukaran |   ( Updated:2021-05-21 07:29:46.0  )
చిప్కో ఉద్యమ సారథి సుందర్‌లాల్ బహుగుణ కన్నుమూత
X

న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణ వేత్త, చిప్కో ఉద్యమ సారథి సుందర్‌లాల్ బహుగుణ(94) రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో శుక్రవారం కన్నుమూశారు. కొన్నాళ్లుగా కరోనాతో పోరాడుతున్న బహుగుణ మధ్యాహ్నం 12 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్ డైరెక్టర్ రవికాంత్ వెల్లడించారు. అడవులను, హిమాలయ శిఖరాలను కాపాడుకోవాలని ఆయన జీవితాంతమూ గ్రామీణుల్లో అవగాహన కల్పిస్తూనే గడిపారు. జీవావరణమే శాశ్వత ఆర్థికమన్న ఆయన స్లోగన్ ఫేమస్. చిప్కో బలంగా ఉన్నకాలంలో అప్పటి పీఎం ఇందిరా గాంధీ చెట్ల నరికివేతను నిషేధించారు. 1973లో మొదలైన ఈ ఉద్యమంలో స్త్రీలు ముందంజలో ఉండి నడిపించారు. చెట్లను కాపాడటంలో క్రియాశీలకంగా పోరాడుతూ సమాజంలోనూ వారిపట్ల నెలకొన్న కొన్ని జాఢ్యాలను తుడిచేశారు. సుందర్‌లాల్ బహుగుణ మృతి దేశానికి తీరని లోటు అని, ప్రకృతితో సహజీవనం చేసే శతాబ్దాల సంస్కృతిని ఆయన మళ్లీ వెలుగులోకి తెచ్చారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed