పాట కట్టండి.. డబ్బు పొందండి : చింగారి ఆఫర్

by Harish |
పాట కట్టండి.. డబ్బు పొందండి : చింగారి ఆఫర్
X

టిక్ టాక్ మీద నిషేధం విధించాక, దానికి ప్రత్నామ్నాయంగా పాపులర్ అయిన యాప్ చింగారి. భారత్‌తో రూపొందిన ఈ యాప్.. అచ్చం టిక్ టాక్ మాదిరిగానే షార్ట్ వీడియోలను అప్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. అయితే ఇప్పటివరకు సినిమా పాటలు, బయటి పాటలు, వేరే సంగీతానికి వినియోగదారులు నటించారు. కానీ సొంతంగా సంగీతం క్రియేట్ చేయగల సంగీత కళాకారులకు చింగారి యాప్ యాజమాన్యం మంచి ఆఫర్ ప్రకటించింది. కొత్త సంగీతాన్ని, పాటలను సృష్టించి యాప్‌లో అప్‌లోడ్ చేస్తే, ఆ పాట రీచెబులిటీకి తగ్గట్టుగా డబ్బులు చెల్లిస్తామని వెల్లడించింది. ఇందుకోసం ఔత్సాహిక ఇండీ మ్యూజిక్ కంపోజర్లు ముందుకు రావాలని ఆహ్వానించింది.

అయితే కంపోజర్లకు ఏ మాధ్యమం ద్వారా డబ్బులు చెల్లించనుందనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. కానీ ప్రస్తుతానికి చింగారి యాప్‌లో వీడియోలు పెట్టినందుకు, వాటికి వచ్చిన వ్యూస్ ఆధారంగా కొన్ని పాయింట్లను ఇస్తోంది. ఈ పాయింట్లను తర్వాత డబ్బు రూపంలోకి మార్చుకునే అవకాశం కూడా ఉంది. టిక్ టాక్ నిషేధంతో చింగారి యాప్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతోంది. కాగా పూర్తిగా దేశీ కంటెంట్‌తో ఉన్న ఈ యాప్‌లో ఒరిజినల్ సంగీతం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చింగారి యాజమాన్యం అభిప్రాయపడుతోంది.

Advertisement

Next Story

Most Viewed