కరోనా కన్నీటి గాధ.. కన్నీళ్లు తెప్పిస్తోంది

by vinod kumar |   ( Updated:2023-03-14 09:22:10.0  )
కరోనా కన్నీటి గాధ.. కన్నీళ్లు తెప్పిస్తోంది
X

రోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తోందో అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా చైనాలో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సంఘటనలు చైనీయుల్లో ఆత్మవిశ్వాసం నింపితే.. ఇంకొన్ని ఆవేదన మిగుల్చుతున్నాయి. కరోనా వైద్యుడు తన వివాహాన్ని కేవలం 10 నిమిషాల్లో ముగించుకుని విధులకు హాజరై రోగులకు తానున్నానన్న భరోసా కల్పిస్తే.. ఒక జంట లైవ్ స్ట్రీమింగ్ లో రిసెప్షన్ నిర్వహించుకుని స్పూర్తి పంచింది. ఇదే సమయంలో కరోనా సోకిన తల్లి కుమార్తెతో చేసిన సంభాషణ కన్నీరు తెప్పిస్తోంది.

హనాన్ ప్రావిన్స్ లోని పుగావ్ కౌంటీలో ఉన్న పీపుల్స్ ఆస్పత్రిలో ఓ నర్స్, ఆమె కూతురు ఒకరి నొకరు దూరం నుంచి కన్నీటి పర్యంతమై సంభాషించిన తీరు హృదయాలను కలచి వేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను చైనా ప్రభుత్వం విడుదల చేయడంతో అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు వద్దకు ఆమె కుమార్తె ఓ సంచి పట్టుకుని వచ్చింది.

అయితే వారిద్దరు మాస్క్ లు ధరించి ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా బయటివారిని కలుసుకోవడంపై నిషేధం ఉండటంతో కూతురు దూరం నుంచి ‘అమ్మా నిన్ను చాలా మిస్ అవుతున్నా’ అంటూ గాల్లోనే చేతులు చాచగా.. నర్సు కూడా అదే రీతిలో స్పందించింది. ఇద్దరూ చేతులు చాచి ఒకరి నొకరు కౌగలించుకున్నట్లు దూరంగా నిలబడిపోయారు. ‘ఆస్పత్రిలో కరోనా పిశాచితో పోరాడుతున్నా.. దాన్ని తరిమికొట్టాకే ఇంటికి వస్తా’ అంటూ ఆమె కూతురు తెచ్చిన సంచిని తీసుకుని ఆస్పత్రిలోకి వెళ్లి పోయింది. ఇప్పటికే లక్షలమంది ఈ వీడియో ను చూసి కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed