రూ. వెయ్యి కోట్ల మనీలాండరింగ్

by Anukaran |   ( Updated:2020-08-16 11:26:53.0  )
రూ. వెయ్యి కోట్ల మనీలాండరింగ్
X

న్యూఢిల్లీ: హవాలా నిర్వహిస్తున్న ఓ చైనా జాతీయుడిని ఐటీ అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. చైనా కంపెనీల పేర్లతో నకిలీ బిల్లులు, ఆర్డర్లు సృష్టించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు తెలుస్తోంది. రూ. వెయ్యి కోట్ల వరకు మనీలాండరింగ్ చేసినట్టు సమాచారం. చార్లీ పెంగ్ అనే నకిలీ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న లువో సంగ్ నేపాల్ గుండా అక్రమంగా దేశంలోకి చొరబడ్డారని, మిజోరంకు చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకుని ఆధార్, పాన్ కార్డులనూ సంపాదించుకున్నాడు. చార్టెర్డ్ అకౌంటెంట్ సహాయంతో సుమారు 40 బ్యాంక్ ఖాతాలను నిర్వహించాడు. రూ. 300 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు తెలిసింది. అదీగాక, టిబెట్ బౌద్ధ సన్యాసులకు కోట్లల్లో డబ్బులు అందించినట్టు తెలుస్తోంది. బౌద్ధ మత గురువు దలై లామా వివరాలను కనుక్కోవడానికే రూ. కోట్లతో ఎరవేసినట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed