- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరేళ్లుగా ఆస్పత్రిలోనే ఓ కుటుంబం..
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఎవరికైనా హాస్పిటల్‌కు వెళ్లిన పదినిమిషాల్లోనే ఎప్పుడెప్పుడు బయట పడదామా! అన్నట్లు అనిపిస్తుంది. ఎమర్జెన్సీ, సర్జరీ కేసులు మినహాయిస్తే.. ఎంత కార్పొరేట్ ఆస్పత్రయినా అక్కడ ఉండాలంటే మనసొప్పదు. కానీ ఓ ఫ్యామిలీ మాత్రం ఆరేళ్లుగా హాస్పిటల్ రూములో ఉండటమే కాకుండా, దాన్నే ఇల్లుగా మలచుకున్నారు. హాస్పిటల్ నిర్వాహకులు వాళ్లను అక్కడి నుంచి పంపించేందుకు ఎంతగా ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. ఇంతకీ వాళ్లు ఆస్పత్రిలో ఎందుకు ఉన్నారు? నిర్వాహకులు వాళ్లను ఎందుకు పంపించాలనుకున్నారు? అసలు ఏం జరిగింది? వంటి విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
చైనాకు చెందిన తియాన్ అనే వ్యక్తి.. 2014లో రెండు నెలల పాటు వికారం, వాంతులతో బాధపడుతూ నడవడానికి కూడా ఇబ్బందిపడ్డాడు. దాంతో అతడిని బీజింగ్‌లోని ఓ హాస్పిటల్‌లో చేర్చగా, కొన్ని రోజులపాటు అబ్జర్వేషన్‌లో పెట్టిన డాక్టర్లు.. తియాన్ ఆరోగ్యం కుదుటపడ్డాక డిశ్చార్జి చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఆస్పత్రి బిల్లు చూసి ఖంగుతిన్న తియాన్.. వాంతులవుతున్నాయని వస్తే, అనవసరంగా అడ్మిట్ చేసుకుని, లక్షల రూపాయల బిల్లు వేస్తారా? ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించాడు. ఆ బిల్లు సంగతి తేలేవరకు హాస్పిటల్‌ను వీడేది లేదని పట్టుపట్టాడు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులతో పాటు అన్ని సామాన్ల తెచ్చుకుని అదే రూమ్‌లో జీవించడం మొదలుపెట్టాడు. అంతేకాదు పండుగల సమయంలో.. తన బంధువులను సైతం హాస్పిటల్‌కు ఆహ్వానించి పార్టీలు చేసుకున్నాడు. తియాన్ ఇంత రచ్చ చేస్తుంటే.. హాస్పిటల్ వాళ్లు ఎలా ఊరుకుంటారని అనుకుంటున్నారా? వాళ్లు కూడా తియాన్ కుటుంబాన్ని అక్కడి నుంచి పంపించేందుకు సర్వ ప్రయత్నాలు చేయడంతో పాటు కోర్టుకు కూడా ఈడ్చారు.
కానీ కోర్టుల సంగతి తెలిసిందే కదా. ఒక్క కేసు తీర్పు ఇవ్వడానికి.. సంవత్సరాల పాటు వాయిదాలు వేస్తుంది. ఈ కేసు కూడా ఆరేళ్లుగా సాగుతూ వస్తుండగా, 2019లో తియాన్ మెడికల్ బిల్లులో రూ. 1.42 కోట్లు మాఫీ చేసేందుకు ముందుకొచ్చిన హాస్పిటల్ యాజమాన్యం.. తియాన్‌కు ఎలాంటి వైద్యం అవసరం లేదని, అతడు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడంటూ కొన్ని రిపోర్టులను కోర్టుకు ఎవిడెన్స్‌గా సమర్పించింది. కొన్నేళ్లుగా రోగుల వార్డులోని గదిని ఆక్రమించాడని, దీనివల్ల నిజమైన రోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. పైగా, అతడు హాస్పిటల్ అందిస్తున్న అన్ని రకాల సదుపాయాలను వాడుకుంటున్నాడని పేర్కొంది. అయితే, తియాన్ తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, హాస్పిటల్ తనకు సరైన వైద్యం అందించకుండా తప్పుడు రిపోర్టులు చూపిస్తోందని వాదించడంతో మళ్లీ కేసు మొదటికి వచ్చింది.
ఫైనల్లీ.. గత వారం ఈ కేసు మరోసారి విచారణకు రాగా.. తియాన్, అతడి తల్లిదండ్రులు హాస్పిటల్ వార్డును ఖాళీ చేసి వెళ్లాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా తియాన్ కుటుంబానికి రూ.5.36 లక్షలు పరిహారంగా చెల్లించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. దీనికి తియాన్ కుటుంబీకులు కూడా అంగీకరించడంతో ఆరేళ్ల తర్వాత కేసుకు పరిష్కారం దొరికింది. ఎట్టకేలకు తియాన్ హాస్పిటల్ వీడగా, అతడి సామాన్లను.. స్వయంగా హాస్పిటల్ యాజమాన్యమే అంబులెన్సులో తరలించడం విశేషం.