- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత… ప్రభుత్వంపై చినరాజప్ప ఆగ్రహం
దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ‘ఓటిఎస్ వసూళ్లు-పేదల మెడకు ఉరితాళ్ళు’పేరుతో టీడీపీ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. పార్టీ నాయకత్వం పిలుపులో భాగంగా మాజీమంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గొల్లపల్లి సూర్యారావు అలాగే టీడీపీలకు చెందిన పలువురు నేతలు కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు.
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న వన్ టైమ్ సెటిల్మెంట్ ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కాకినాడ కలెక్టరేట్‌లో కలెక్టర్ హరికిరణ్‌ను కలిసేందుకు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. శాంతియుతంగా నిరసన చేపట్టిన తెలుగుదేశం పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడం పూర్తిగా ఖండిస్తున్నట్లు మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.