వార్నింగ్ : చైనాలో మరో ప్రాణాంతక వ్యాధి.. టెన్షన్‌లో ప్రజలు

by Anukaran |   ( Updated:2021-08-09 22:31:23.0  )
వార్నింగ్ : చైనాలో మరో ప్రాణాంతక వ్యాధి.. టెన్షన్‌లో ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్ : చైనాను మరో ప్రాణాంతక వ్యాధి కలవర పాటుకు గురి చేస్తోంది. హెబీ ప్రావిన్స్ ఉత్తరాన గల చెంగ్డే నగరంలో అత్యంత ప్రాణాంతక వ్యాధి ఆంత్రాక్స్ న్యూమోనియా కేసు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో వ్యాధి బారినపడ్డ వ్యక్తిని హుటాహుటిన చైనా రాజధాని బీజింగ్‌కు తరలించారు. అతడిని క్వారంటైన్‌లో ఉంచి వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. బాధితుడికి పశువులు, గొర్రెల ద్వారా ఆంత్రాక్స్ న్యూమోనియా వచ్చినట్టు వైద్యులు గుర్తించారు.

ఆంత్రాక్స్ న్యూమోనియా మాంసం, కలుషిత ఆహారం, ధూళి ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారికి వాంతులు, వికారం, విరేచనాలు కలుగుతాయని దీని వల్ల ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Next Story