- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
800 మీటర్ల భారత భూభాగంపై కన్నేసింది
న్యూఢిల్లీ: ఇండియా, చైనా ట్రూపులు ప్యాట్రోల్ పాయింట్ 14 నుంచి వెనుదిరిగిన తర్వాత డ్రాగన్ మనదేశ భూభాగాన్ని ఎంతమేరకు ఆక్రమించజూసిందో స్పష్టమవుతున్నది. పీపీ 14 నుంచి సుమారు 800 మీటర్ల మేరకు భారత భూభాగాన్ని తమదిగా చైనా డిమాండ్ చేస్తు్న్నది. గాల్వన్ లోయ అంతా తమదేనని చైనా విదేశాంగ పెద్దపెద్ద ప్రకటనలు చేసింది. కాగా, ఈ 800 మీటర్ల భూభాగంపై తొలిసారిగా చైనా ఈ ఏప్రిల్‌లో సైన్యాధికారుల చర్చల్లో మాట్లాడింది.
వెనక్కి తగ్గినా.. అప్రమత్తమే:
గాల్వన్ నుంచి చైనా మిలిటరీ ట్రూపులు వెనక్కి తగ్గడంపై భద్రతావర్గాలు అప్రమత్తంగానే ఉన్నాయి. 61ఏళ్ల క్రితం చైనా జిత్తుల గురించి అందరికీ తెలిసిందే. 1959లో పీపీ 14వరకు తమ భూభాగాలని భారత్, చైనాలు అంగీకరించాయి. తాజాగా, మరో 800 మీటర్ల దూరం మేరకు తమ భూభాగమేనని కొత్తరాగమందుకుంది. ఈ నేపథ్యంలోనే 1962లో ఓ పేపర్ బ్యానర్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. గాల్వన్ పోస్టు నుంచి చైనా ట్రూపులు వెనక్కి మళ్లుతున్నాయన్న హెడింగ్‌తో ఆ పేపర్ క్లిప్ ఉన్నది. అయితే, సరిగ్గా ఆ హెడింగ్ ప్రింట్ అయిన 91 రోజుల తర్వాత ఇరుదేశాల మధ్య యుద్ధం(1962) బద్ధలైంది. గాల్వన్ సహా పలుప్రాంతాల్లో చైనా ఆర్మీ దిగిన సంగతి తెలిసిందే. కానీ, 2020లో భారత బలం, వ్యూహం వేరు అని నిపుణులు చెబుతున్నారు.