- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ ఐదుగురిని అప్పగించిన చైనా..
by Shamantha N |

X
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లోని సరిహద్దు గ్రామం నుంచి చైనా ఆర్మీ అపహరించినట్టు భావించిన ఐదుగురిని ఆ దేశం అప్పగించింది. శనివారం మధ్యాహ్నం వారు ఆర్మీ సంరక్షణతో క్షేమంగా భారత్ చేరారు. అరుణాచల్‌ప్రదేశ్ అంజావ్ జిల్లా కిబితూ ఏరియాలో ఈ అప్పగింతలు జరిగాయి. అన్ని ఫార్మాలిటీలు ముగిసినాక వారిని ప్రస్తుతం ఆర్మీ అదుపులోకి తీసుకుంది.
14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి తర్వాత వారి కుటుంబాలకు అప్పగించనునున్నారు. ఈ నెల 4న వేటకు వెళ్లిన వీరిని చైనా ఆర్మీ అపహరించినట్టు కుటుంబీకులు తెలిపిన సంగతి తెలిసిందే. అనంతరం కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఈ ఘటనపై స్పందించి ఆర్మీ ద్వారా చైనా పీఎల్ఏకు హాట్‌లైన్ మెస్సేజీ పంపినట్టు తెలిపారు.
Read Also…
Next Story