- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాపై చైనా చర్యలు… షాకింగ్
చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మరింత ప్రబలకుండా చైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. 9 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొచ్చిన చైనా, మరో పది రోజుల్లో 1500 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. అంతటితో ఆగని చైనా వివిధ ప్రాంతాలకు రాకపోకలపై కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. కరోనా తీవ్రంగా ఉన్న వూహాన్ వంటి నగరాల్లో నిత్యావసర సరకుల కోసం రెండు రోజులకు ఒక వ్యక్తి మాత్రమే బయటకు రావాలని సూచించింది.
దీంతో కరోనా నెమ్మదిగా దారికొస్తోంది. ఇప్పటికే 900 మందిని పొట్టన బెట్టుకున్న ఈ మహమ్మారి మరింత ప్రబల కుండా.. మరో కరోనా చావు ఉండకూడదన్న ఉద్దేశ్యంతో కరోనా అనుమానితులను వెతికి పట్టుకుని మరీ భద్రతా సిబ్బంది ఆసుపత్రులకు తరలిస్తున్నారు. తమకు కరోనా లేదని గగ్గోలు పెడుతున్నా.. వ్యాధికారక సూచనలు కనపడుతున్నాయంటూ బలవంతంగా తాళ్లతో కట్టేసి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. తమను ఆసుపత్రికి తీసుకెళ్లొద్దని, తాము రాబోమని కేకలు పెడుతున్నప్పటికీ వారిని భద్రతా సిబ్బంది వదలడం లేదు. వైరస్ సోకిన బాధితుల సంఖ్య వేల సంఖ్యలో ఉండడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది.
మరోవైపు భారత ప్రభుత్వం కూడా కరోనాపై కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే చైనాకు ఈవీసాలు జారీ చేయడం ఆపేసింది. మరోవైపు జనవరి 15 తర్వాత చైనా వెళ్లి, అక్కడి నుంచి భారత్ లో అడుగుపెట్టాలనుకునే విదేశీయులను అనుమతించబోమని డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటన చేసింది. ఈ మేరకు అన్ని విమానయాన సంస్థలకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పలు విమానయాన సంస్థలు ఇప్పటికే భారత్-చైనా మధ్య విమాన సర్వీసులను నిలిపివేశాయి. అటు, చైనా నుంచి మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ సరిహద్దుల ద్వారా భారత్ లో ప్రవేశించే విదేశీయులకు అనుమతి నిరాకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
జపాన్ తీరంలో షిప్‌లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే జపాన్ లోని విదేశాంగ శాఖతో మాట్లాడిన మోదీ.. వీరి రక్షణ చర్యలపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఫోన్‌లో మాట్లాడారు.