- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై జర్నలిస్ట్ పిటిషన్
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో సచివాలయం భవనాల కూల్చివేత దృశ్యాలను చిత్రీకరించడానికి మీడియాను అక్కడకు తీసుకెళ్ళిన ప్రభుత్వ అధికారులు, పోలీసులు సోషల్ డిస్టెన్స్ నిబంధనలను బుట్టదాఖలా చేశారని, వారికి పాజిటివ్ సోకితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు, భారత ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్‌కు జర్నలిస్టు చిలువేరు శ్రీశైలం పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను అధికారులు, పోలీసులే ఉల్లంఘించారని, ఒకే వాహనం (ఓపెన్ టాప్ వ్యాన్)లో పదుల సంఖ్యలో ఎక్కించుకుని తీసుకెళ్ళారని, కనీసం వాహనం నుంచి కిందికి దిగడానికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.
హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో ప్రభుత్వం మీడియాకు ఈ ఏర్పాటు చేసిందని, కానీ కరోనా మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేదని, ఆ స్పృహను కూడా అధికారులు, పోలీసులు మరిచారని శ్రీశైలం ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. జంతువులను వ్యాన్‌లో తీసుకెళ్ళిన తరహాలో ఫోటోలను, వీడియోను చిత్రీకరించే జర్నలిస్టులను వాహనంలో కుక్కి తీసుకెళ్ళారని పేర్కొన్నారు. కనీసంగా ఒక మీటరు దూరాన్ని పాటించాలన్న నిబంధనను పోలీసులు పట్టించుకోలేదని, పాత్రికేయుల భద్రతను గాలికొదిలేసిందని పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యానికి, నిబంధనల ఉల్లంఘనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.