ఆ పిల్లల అమాయకత్వానికి నెటిజన్స్ ఫిదా.. వైరల్‌గా మారిన వీడియో

by Shyam |
Childrens dance
X

దిశ, వెబ్‌డెస్క్: పిల్లలు స్వచ్ఛమైన మనసుకు, అమాయకత్వానికి నిలువెత్తు నిదర్శనాలని చెప్పొచ్చు. అందుకే అలాంటి వారు ఇతరుల్లో నిజమైన ప్రేమను పుట్టిస్తారు. పిల్లలకు పేద, ధనిక మధ్య తేడా తెలియదు. అలాంటి ఇద్దరు పిల్లలు మధ్య సామాజిక అసమానతలు ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు కలిసి ఆడుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రస్తుత సమాజంలో తరగతి, కులం కారణంగా ఒకరినొకరు వివక్ష చూపే వ్యక్తులకు ఇది ఓ సరైన పాఠం అని చెప్పొచ్చు.

వీడియోలో, కియాన్ష్ దేటే అనే చిన్న పిల్లవాడు రోడ్డుపై బొమ్మలు అమ్మే వ్యక్తి కొడుకుతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ వేశాడు. అతనితో పాటు ఆ పిల్లవాడు కూడా ఎంజాయ్ చేశాడు. అంతేకాకుండా కియాన్ష్ ఆ పిల్లగాడిని గట్టిగా కౌగిలించుకుంటాడు. ఈ సూపర్ స్వీట్ వీడియోను కియాన్ష్ తల్లి ఫోన్‌లో షూట్ చేసింది. ఈ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు లైక్‌లతో, ఎమోజీలతో అభినందించారు. మరికొందరు కామెంట్ రూపంటో ఆ తల్లి పెంకాన్ని మెచ్చుకున్నారు.

https://www.instagram.com/reel/CVi8y4LjylS/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story