చేనేత‌ల‌ను మోసం చేస్తే ఊరుకోం.. సీఎం కేసీఆర్‌కు వార్నింగ్

by Shyam |
చేనేత‌ల‌ను మోసం చేస్తే ఊరుకోం.. సీఎం కేసీఆర్‌కు వార్నింగ్
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్ : చేనేత కార్మికుల‌ను, ప‌ద్మశాలీల‌ను సీఎం కేసీఆర్ మోసం చేస్తే ఊరుకోబోమని చేనేత వ‌ర్గాల చైత‌న్య వేదిక జాతీయ అధ్యక్షుడు చిక్కా దేవ‌దాసు హెచ్చరించారు. మొద‌టి నుంచీ మోసం చేస్తూనే ఉన్నారని, ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో అన్యాయం చేస్తే ఊరుకునేది లేదన్నారు. అదే మాదిరి ఇప్పుడు ఎల్‌. ర‌మ‌ణ‌ను మోసం చేయ‌డానికి పూనుకున్నాడ‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన సంద‌ర్భంగా ఎల్‌. ర‌మ‌ణ‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తాన‌ని సీఎం మాట ఇచ్చార‌ని గుర్తు చేశారు. ప‌ద్మశాలీల‌కు ప‌ద‌వులు వ‌స్తే త‌మ త‌ల‌రాత‌లు మారుతాయ‌ని కార్మికులు ఆశిస్తున్నార‌న్నారు. కానీ ఇప్పుడు త‌మ ఆశ‌లు అడియాశలే అయ్యాయ‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. కొండా ల‌క్ష్మణ్ బాపూజీ ఆశయాల‌కు అనుగుణంగా ఎల్‌. ర‌మ‌ణ‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. లేనిప‌క్షంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగుతామ‌ని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed