- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్‌లాక్‌కు సమయం ఆసన్నమైంది : కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ‘అన్‌లాక్’కు సమయం ఆసన్నమైందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ నెల 31వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. దశలవారీగా ఈ పద్ధతిని అమలు చేస్తామని, ప్రతివారం కొన్ని కార్యక్రమాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపునిస్తామని తెలిపారు. కేసులు తగ్గుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని, మళ్లీ కేసులు పెరిగితే లాక్‌డౌన్ విధించడం అనివార్యమేనని, ప్రజలు దీన్ని గుర్తించాలని ఓ వెబ్‌క్యాస్ట్‌లో మాట్లాడుతూ పేర్కొన్నారు.
ఇందులో భాగంగా ముందు వలస కార్మికులు, దినసరి కూలీల గురించి ఆలోచించాల్సి ఉంటుందని, కరోనా నుంచి తప్పించుకుని ఆకలికి ప్రాణాలను బలివ్వడం సమంజసం కాదని చెప్పారు. వారి కోసమే తొలిగా నిర్మాణ పనులు, ఫ్యాక్టరీ పనులకు ఈ నెలాఖరు నుంచి మినహాయింపు ఇస్తామని వివరించారు. అన్నింటినీ ఒకేసారి అన్‌లాక్ చేయడం సాధ్యపడదని తెలిపారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పకపాటించాలని, అత్యవసరమైతేనే ఇంటి బయట అడుగుపెట్టాలని కోరారు. లాక్‌డౌన్‌లో ఢిల్లీ ప్రజలు సహకరించారని, నెలరోజుల నుంచి కొత్తకేసులతోపాటు పాజిటివిటీ రేటును తగ్గించడంలో తోడ్పడ్డారని వివరించారు.