- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంతరిక్షంలోకి చికెన్ నగెట్
దిశ, వెబ్‌డెస్క్: ఎవరైనా తమ పుట్టినరోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. సామాజిక స్పృహ ఉన్నవారైతే ఆ రోజున సేవా కార్యక్రమాలు చేపడతారు లేదా అనాథ, వృద్ధాశ్రమాలకు చేతనైన సాయం అందిస్తారు. ఇక ఏదేని సంస్థ వార్షికోత్సవమైతే.. అందులోని ఉద్యోగులకు పార్టీతో పాటు బోనస్‌లు, ఇతర గిఫ్ట్‌లు ఇస్తుంటారు. అదే ఓ షాప్ అయితే.. తమ కస్టమర్లకు లక్కీ డిప్ బహుమతులు, ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తుంటాయి. ఈ క్రమంలోనే యూకేకు చెందిన ఓ సూపర్ మార్కెట్.. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వీటన్నికంటే భిన్నంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంతరిక్షంలోకి చికెన్ నగెట్‌ను పంపించారు.
‘ఈ రోజు ప్రపంచంలోనే తొలిసారిగా మేము అంతరిక్షంలోకి చికెన్ నగెట్‌ను పంపించాం. దీన్ని ఎవరూ గుర్తించకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మాకంటూ ఓ ఐడియా లేదు.. కానీ నగెట్ ఈ ప్రపంచం దాటి పోయింది’ అని యూకేకు చెందిన ఐస్‌లాండ్ ఫుడ్స్ అనే సూపర్ మార్కెట్ నిర్వాహకులు వెల్లడించారు. యూకేలోని నార్త్ వేల్స్ ప్రాంతంలోని ఐస్ ల్యాండ్స్ హెడ్ క్వార్టర్స్ సమీపం నుంచి నగెట్‌ను లాంచ్ చేశారు. ఆ నగెట్ 1,10,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన లాంచ్ వెహికల్ ఆధారంగా ఇది సాధ్యమైంది. హైడ్రోజన్ నింపిన మెటియరోలాజికల్ వెదర్ బెలూన్ భద్రంగా నగెట్‌ను స్ట్రాటోస్ప్రియర్ వరకు తీసుకెళ్లింది. ఇంటిగ్రేటెడ్ కెమెరా సాయంతో దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ తీశారు. ఈ వీడియోను తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరితో పంచుకున్నారు.