- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.5 పైసలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం.. కానీ, అంతలోనే అలా జరగడంతో..?
దిశ, వెబ్‌డెస్క్: బిర్యానీ.. అదొక ఎమోషన్. బిర్యానీ తినని వారుండరు. ఇక వారి ఆసక్తిని గమనించే కొత్తగా తెరిచే హోటళ్లు, రెస్టారెంట్లు బంపర్ ఆఫర్లను ప్రకటించి వారి వద్దకు రప్పించుకుంటాయి. రూ. 300 ఉన్న బిర్యానీ ని రూ. 100 కే ఇస్తూ కస్టమర్లను అట్ట్రాక్ట్ చేస్తాయి. ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీ అందరికి తెలిసిందే. అయితే తమిళనాడులోని ఒక రెస్టారెంట్ పెట్టిన ఆఫర్ మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. అంత సంచలనంగా మారిన ఆ ఆఫర్ ఏంటి అంటే.. ‘ఐదు పైసలకే బిర్యానీ’. ఏంటీ ఐదు పైసలకే బిర్యానీనా.. అని ఆశ్చర్యపోతున్నారా..? మరి మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే అదేగా మరి. ఇక ఈ ఆఫర్ తో ఒక్కరోజులోనే ఆ రెస్టారెంట్ స్టార్ రెస్టారెంట్ గా మారిపోయింది. బిర్యానీ ప్రియులు రెస్టారెంట్ తెరవకముందే క్యూ కట్టేశారు కూడా. మరి ఈ రెస్టారెంట్ కి సంబంధించిన పూర్తీ వివరాలు తెలుసుకుందాం రండి.
తమిళనాడులోని మదురైకి చెందిన ఓ వ్యాపారి బిర్యానీ సెంటర్‌ను ప్రారంభించారు. వ్యాపారంలో కస్టమర్లే దేవుళ్లు.. వారిని రెస్టారెంట్ కి రప్పించాలంటే ప్రమోషన్ అనేది చాలా ముఖ్యం. అసలే ఫుడ్ బిజినెస్.. చుట్టూ చూస్తే పోటీకి చాలానే రెస్టారెంట్లు ఉన్నాయి. ఎలాగైనా కస్టమర్లను మన వైపు తిప్పుకోవాలని ఆ వ్యాపారి ఒక బంపర్ ఆఫర్ పెట్టాడు. ఎవరైతే రూ.5 పైసల నాణెం తీసుకొస్తారో వారికి బిర్యానీ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. నాణ్యమైన, రుచికరమని బిర్యానీని రూ.5 పైసలతోనే తినండి.. ఆలోచించినా ఆశాభంగం అంటూ ప్రకటన ఇచ్చాడు. ఇక ఇంత గొప్ప ఆఫర్ విన్న భోజన ప్రియులు ఆగుతారా.. ఇంట్లో మూలన ఉన్న 5 పైసల నాణెంను కష్టపడి వెతికి మరీ బిర్యానీ కోసం క్యూ కట్టారు. అందులో ఎక్కువ యువతే ఉండడం గమనార్హం.
కరోనా ఉందన్న ఆలోచన లేదు.. మాస్క్ పెట్టుకోవాలన్న ధ్యాస లేదు.. బిర్యానీ కావాలనే ఒకే ఆశతో అక్కడ వాలిపోయారు. దాదాపు 300 మంది 5 పైసలతో బిర్యానీ సెంటర్ ముందు హల్చల్ చేసారు. ఒక్కరో ఇద్దరో వస్తారనుకొని ఈ ఆఫర్ పెడితే ఇంతమంది వచ్చారు.. వీరందరికి బిర్యానీ పెట్టలేను అంటూ ఆ యజమాని లబోదిబో మన్నాడు. ఇక ఇదంతా ఒక ఎత్తైతే ఒకేదగ్గర అంతమంది గుమిగూడి ఉండడం చూసిన పోలీసులు విషయం తెలుసుకొని వారందరిని చెదరగొట్టారు. కరోనా నియమాలను పాటించకుండా ఈ ఆఫర్ పెట్టినందుకు యజమానిని హెచ్చరించి వదిలేశారు. దీంతో ఆ బిర్యానీ సెంటర్ మూసివేశారు. షాపు మూసేసిన సంగతి తెలియని చాలా మంది ఇంకా అక్కడకు చేరుకుంటున్నారు. ఐదు పైసలు ఇస్తే బిర్యానీ ఇస్తామన్నారని.. ఇల్లంతా సోదా చేసి మరీ 5 పైసలు తెస్తే దుకాణం మూసేశారని కొందరు వాపోయారు.