- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చికెన్.. వి కెన్..
దిశ, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా వైరస్) ఎంత వేగంగా వ్యాపిస్తోందో.. రెట్టింపు వేగంతో దీనిపై వదంతులూ చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్ల ప్రభావం తెలుగు రాష్ట్రాలనూ తాకింది. అందులో ఒకటి చికెన్ తింటే.. కరోనా సోకుతోందనే ప్రచారం మన సామాజిక మాద్యమాల్లో జోరుగా సాగుతోంది. ఈ దెబ్బకు చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. దీంతో కిలో రూ.240గా ఉన్న చికెన్ ధర.. ఊహించని రీతిలో రూ.90కి పడిపోయింది. ఫలితంగా చికెన్ విక్రయదారులు నష్టాల్లో మునుగుతున్నారు.
చికెన్ తింటే నిజంగానే కరోనా వ్యాపిస్తోందా.. అంటే అందుకు సరిపడా రుజువులు లేవు. వాస్తవానికి కరోనా వైరస్‌కు గల కారణాలను ప్రజలకు తెలియజేయడంలో ప్రభుత్వం విఫలమైందని చికెన్ షాప్ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో.. చికెన్ వల్ల కరోనా సోకదని ప్రజలకు అవగాహన కల్పించేందుకు పౌల్ట్రీ యజమానులు ఇప్పటికే పత్రికల్లో ప్రకటనలు చేసినా అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయి. దీంతో వినూత్నంగా ఆలోచించి, ‘చికెన్ అండ్ ఎగ్ మేళా’ పేరుతో ఉచితంగా చికెన్, ఎగ్ వంటకాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందుకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వేదిక కావడం విశేషం. ఆలిండియా పౌల్ట్రీ డెవలప్ మెంట్ అండ్ సర్వీసెస్ ప్రయివేటు లిమిటెడ్, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ వారు సంయుుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 5 వేలకు పైగా నగరవాసులు హాజరవడం విశేషం.
ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ.. చికెన్ ద్వారా కరోనా వస్తుందనేది అపోహ మాత్రమేనన్నారు. కరోనా వైరస్ 20డిగ్రీల సెల్సియస్ లోపే బతుకుతుందని తెలిపారు. అలాగే, పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వ మద్దతు ఉందని చెప్పటానికే ఈ మేళాకు వచ్చినట్టు స్పష్టం చేశారు. కాగా, రాజేందర్ కూడా పౌల్ట్రీ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే.