సుశాంత్ సింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జనవరి 7న విడుదల కానున్న ‘ఛిఛోరే’

by Shyam |
సుశాంత్ సింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జనవరి 7న విడుదల కానున్న ‘ఛిఛోరే’
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. అభిమాన నటుడు ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయినా అతని సినిమాలు మాత్రం ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఈ మేరకు సుశాంత్ చివరగా నటించిన మూవీ ‘ఛిఛోరే’ నేషనల్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 7న చైనాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్.. తాజా చైనా భాషలో ఉన్న ‘ఛిఛోరే’ పోస్టర్‌ను విడుదల చేయడం విశేషం. అయితే కరోనా తర్వాత చైనాలో విడుదల కానున్న తొలి భారతీయ చిత్రం ‘ఛిఛోరే’ కావడంతో అభిమానులను ఫుల్ ఖుష్ అవుతుండగా.. ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story