- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ మద్యం .. హోమ్ డెలివరీ
దిశ, వెబ్ డెస్క్ :
కరోనా వైరస్ కట్టడి కోసం అన్ని ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందుల్లో పడ్డాయి. రెండు సార్లు ప్రకటించిన లాక్డౌన్ లలో సడలింపులకు ఆస్కారం ఇవ్వలేదు. మూడో దశ లాక్‌డౌన్ అమల్లో భాగంగా కొన్నింటికి మినహాయింపు ఇచ్చారు. ఆ జాబితాలో వైన్స్ కూడా ఉన్నాయి. దాంతో మద్యం షాపులు తెరిచేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైన్స్ షాపులు ఓపెన్ అయ్యాయి. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా నిన్నటి నుంచి మద్యం అమ్మకాలకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. మద్యం షాపుల వద్ద ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ మందుబాబులు అవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.
లాక్డౌన్ విధించి 40 రోజులు దాటి పోయింది. అప్పటికే మద్యపాన ప్రియులు వైన్ షాపులు ఓపెన్ చేయాల్సిందిగా కోర్డు మెట్లు కూడా ఎక్కారు. చాలా మంది పిచ్చిపిచ్చిగా ప్రవర్తించారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైన్ షాపుల విషయంలో కఠినంగా వ్యవహరించి వాటిని తెరిచేందుకు అనుమతివ్వలేదు. కానీ ఎట్టకేలకు మూడో లాక్డౌన్ వేళ.. వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు నెలన్నర నుంచి మద్యం లేకపోవడంతో.. మద్యం ప్రియులు తెల్లవారుజామునుంచే దుకాణాల వద్ద క్యూ లైన్లు కట్టారు. కొన్నిచోట్ల కిలో మీటర్ల మేరా లైన్లు కట్టారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, సోషల్ డిస్టెన్స్ కూడా పాటించకుండా మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా.. భౌతిక దూరం పాటించకుండా.. కనీసం మాస్క్‌లు కూడా ధరించకుండా వైన్స్‌ల దగ్గరకు వచ్చేస్తున్నారు. ఇదంతా గమనించిన ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం ఆన్ లైన్ మద్యం విక్రయాలకు తెరతీసింది.ఇక మద్యం షాపుల వద్ద లైన్లను తగ్గించేందుకు డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఓ ప్రత్యేక మొబైల్ యాప్‌తో పాటు వెబ్‌సైట్‌ను కూడా రూపొందించింది. మద్యం కావాల్సిన వారు తమకు కావాల్సిన బ్రాండ్ నేమ్ ఆర్డర్‌తో పాటు, డబ్బులను కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఒక్కో వ్యక్తికి 5000 మిల్లీ లీటర్ల (5 లీటర్ల) మద్యం కొనుగోలు చేసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది… ఇక, రూ.120 డెలివరీ ఛార్జీలు అదనంగా వసూలు చేస్తారు. మొత్తానికి వైన్‌షాపుల దగ్గర ఒకరిమీద ఒకరు పడి.. కరోనా కష్టాలు తెచ్చుకోకుండా.. ఇంటి దగ్గరే కూర్చొని.. లిక్కర్ అందుకోవడం మంచిదే అంటున్నారు.
Tags: lockdown, liquor, wines, online order