- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూలు, పండ్ల చెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తనయుడు
దిశ, వెబ్‌డెస్క్: పల్లెల్లో పచ్చదనం.. ప్రగతికి సోపానం అని ఎమ్మెల్యే తనయుడు, యువ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా తుమ్మలగుంట గ్రామంలో 8 వేల పూలు, పండ్ల చెట్లను చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, సర్పంచ్ సుబ్బరామిరెడ్డితో కలిసి పంపిణీ చేశారు. అంతకు ముందు పాఠశాల ఆవరణలో చెట్టు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ సమస్యలు తలెత్తకుండా ప్రతిఒక్కరూ విరివిగా చెట్లు పెంచాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత కరోనా కాలంలో ఆక్సిజన్ ఇబ్బందులను మనం కళ్ళారా చూశామన్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి 10 లక్షల చెట్లు పెంచాలని సంకల్పించారని తెలిపారు. చెవిరెడ్డి నేతృత్వంలో అందజేసిన పూలు, పండ్ల చెట్లను పరిరక్షించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెట్లను పెంచడం అలవాటుగా మార్చుకోవాలని కోరారు. ఆహ్లాదకర వాతావరణంలో ఆరోగ్యకర జీవితాన్ని అనుభవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మధుసూదన్, వార్డు సభ్యులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.