- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ జరగక పోతే నా పరిస్థితి దారుణం : సకారియా
దిశ, స్పోర్ట్స్ : రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఐపీఎల్ 2021లో అరంగేట్రం చేసిన పేసర్ చేతన్ సకారియా తనకు లీగ్ వల్ల లాభం జరిగిందని చెబుతున్నాడు. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో రాజస్థాన్ జట్టు రూ. 1.2 కోట్లకు దక్కించుకున్నది. అందులో తొలి విడతగా రూ. 40 లక్షలను ఇప్పటికే చేతన్ అకౌంట్లో వేసింది. ఐపీఎల్ ప్రారంభానికి ముందే చేతన్ తన సోదరుడిని కోల్పోయాడు. ఇప్పుడు ఐపీఎల్ వాయిదా పడటంతోఇంటికి వెళ్లిపోయాడు. అయితే చేతన్ తండ్రి ఇప్పుడు కరోనా బారిన పడటంతో అతడిని భావ్ నగర్‌లోని ఒక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఐపీఎల్ జరగకపోతే తనకు డబ్బు వచ్చేది కాదని.. అసలు ఆ డబ్బే లేకుంటే తన పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని చేతన్ సకారియా అంటున్నాడు. ఐపీఎల్ వల్ల రాజస్థాన్ అందించిన డబ్బుతోనే తన తండ్రికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు సకారియా పేర్కొన్నాడు. ‘ప్రజలు ఐపీఎల్ ఆపాలని కోరుకున్నారు. ఐపీఎల్ వల్ల నష్టం జరుగుతుందని అంటున్నారు. కానీ దాని ద్వారా నా లాంటి వారికి లాభం కూడా జరుగుతుంది. మా ఇంటిలో నేనొక్కడినే సంపాదించేది. కుటుంబం అంతా నా సంపాదిన మీదే ఆధారపడి ఉన్నది. ఇప్పుడు మా నాన్నకు కరోనా చికిత్స కూడా రాజస్థాన్ యాజమాన్యం అందించిన డబ్బుతోనే చేయిస్తున్నాను. కష్టకాలంలో ఈ డబ్బు చాలా ఉపయోగపడుతున్నది’ అని చేతన్ సకారియా తన ఆవేదనను వెల్లడించాడు.