- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెరువును తలపిస్తున్న చేర్యాల రోడ్లు..!
దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అన్నారు. కొంతమంది అక్రమార్కులు నాలాలను కబ్జా చేయడంతో డ్రైనేజీ గుండా పోవాల్సిన మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తోందని ఆరోపించారు.
ఈ సందర్బంగా అందె అశోక్ మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చేర్యాల పెద్ద చెరువు ఉధృతంగా అలుగు దూకడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయన్నారు. నాలాలను క్లీన్ చేయడం, కబ్జాలకు గురైన స్థలాలను గుర్తించి చర్యలు తీసుకోవడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని మండిపడ్డారు. ఇప్పటికైనా మంత్రి హరీశ్ రావు, స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్పందించి అక్రమార్కులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.