ప్రజాసమస్యలు పరిష్కరించాలి : చెరుపల్లి

by Shyam |
ప్రజాసమస్యలు పరిష్కరించాలి : చెరుపల్లి
X

దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజాసమస్యలు పరిష్కరించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. 19 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ అనితారామచంద్రన్‌కు శుక్రవారం అందజేశారు. 45 రోజుల లాక్‌డౌన్ వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం రాబోయే మూడు నెలల వరకు కుటుంబానికి రూ.10వేలు, నిత్యావసర వస్తువులు ఇవ్వాలని కోరారు. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం నిల్వలను వేగంగా కొనుగోళ్లు చేయాలని తెలిపారు. లాక్‌డౌన్ ముగిసే వరకు మద్యం దుకాణాలను మూసేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు సూచనలు, సలహాలు ఇవ్వడమే తప్పా చేసిందేమీలేదన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో సీపీఎంజిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, కార్యదర్శి వర్గ సభ్యులు బట్టుపల్లి అనురాధ, పార్టీ ఆఫీసు కార్యదర్శి ఆంజనేయులు ఉన్నారు.

tags: Yadadri,cpm,central committee member,cherupally,Request,collector Anita Ramachandran

Advertisement

Next Story

Most Viewed