జనవరి 1న ‘చెప్పినా ఎవరూ నమ్మరు’

by Shyam |   ( Updated:2020-12-16 04:17:52.0  )
జనవరి 1న ‘చెప్పినా ఎవరూ నమ్మరు’
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం. మురళి శ్రీనివాసులు నిర్మించిన సినిమా ‘చెప్పినా ఎవరూ నమ్మరు’. ఆర్యన్ కృష్ణ నటిస్తూ, డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ జనవరి 1న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. గోవా, హైదరాబాద్‌లో రెండు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తి చేశామని తెలిపిన డైరెక్టర్.. ఈ మధ్య కాలంలో ఇలాంటి కామెడీ థ్రిల్లర్ మూవీ రాలేదన్నారు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే సినిమాను 300కు పైగా థియేటర్లలో విడుదల చేస్తామని తెలిపారు. కాగా సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి, విజయేందర్, రాకేష్ ప్రధానపాత్రల్లో కనిపించబోతున్న సినిమాకు జగ్దీద్ వేముల సంగీతం సమకూర్చారు.

Advertisement

Next Story