- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చెన్నమనేని పౌరసత్వంపై విచారణ వాయిదా
దిశ, వేములవాడ: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం వివాదం కేసు విచారణను హైకోర్టు వచ్చేనెలకు వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున కౌంటర్ అఫిడవిట్ ను న్యాయవాది కోర్టుకు సమర్పించారు. విచారణకు హాజరుకావాల్సిన అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రారావు ఆరోగ్యం బాగలేని కారణంగా విచారణను వాయిదా వేయాల్సిందిగా న్యాయవాది కోర్టును కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బెంచ్ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. విచారణకు హాజరైన పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది కూడా కౌంటర్ ను దాఖలుచేశారు. హోంశాఖ కార్యదర్శి సైతం అఫిడవిట్ ను దాఖలుచేశారు. గత కొన్ని నెలలుగా చెన్నమనేని రమేష్ భారత్లో లేకపోవడం, పౌరసత్వంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో కేసుపై సత్వరతీర్పు వెలువడుతుందని ఇరుపక్షాలూ భావించాయి. కానీ హోంశాఖ వైపు నుంచి వివరణలు, చెన్నమనేని రమేష్ నుంచి కౌంటర్ అఫిడవిట్ దాఖలు లాంటి అంశాల కారణంగా తరచూ విచారణ వాయిదాపడుతోంది. కొలిక్కివస్తోంది అనుకుంటున్న తరుణంలో అదనపు అడ్వకేట్ జనరల్ హాజరుకాకపోవడంతో మరోరెండు వారాలు జాప్యం చోటుచేసుకుంది.