చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ – 173

by Anukaran |   ( Updated:2020-10-29 10:18:07.0  )
చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ – 173
X

దిశ, వెబ్‌డెస్క్: టాస్ ఓడి బ్యాటింగ్ తీసుకున్న కోల్‌కత్తా నైడ్ రైడర్స్ జట్టు తొలుత దూకుడుగా వ్యవహరించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, నితీష్ రానా ఆది నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేశారు. వచ్చిన బాల్ ను వచ్చినట్టే బౌండరీకి మలిచే ప్రయత్నం చేశారు. ఇద్దరు నిలకడగా ఆడటంతో తొలి వికెట్ కోల్పోయే సమయానికి KKR జట్టు 53-1 పరుగులు చేసింది. ఏడో ఓవర్లో కరన్ శర్మ వేసిన బంతిని భారీషాట్‌కు యత్నించే క్రమంలో శుభ్ మన్ గిల్ 26(17) బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే మూడో డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సునీల్ నరైన్ 7(7) సాంట్ నగర్ బౌలింగ్‌లో జడేజాకు దొరికిపోయాడు.

ఈ క్రమంలోనే రెండు వికెట్ల నష్టానికి కోల్‌కత్తా జట్టు 60-2 పరుగులు చేసింది. ఆ తర్వాత నితీష్ రాణా CSK బౌలర్లపై విరుచుకపడ్డాడు. సిక్సులు, ఫోర్లతో మోత మోగించాడు. దీంతో నితీష్ రాణా 87(61) పరుగుల వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు.సెంచరీ చేరువవుతున్న క్రమంలో ఎంగిడి బౌలింగ్ నితీష్ భారీ షాట్‌కు యత్నించి సామ్ కరన్ కు దొరికిపోయాడు. దీంతో రాణా ఆశలపై నీల్లు చల్లినట్లు అయింది. KKR జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 144-4(17.4) పరుగులు సాధించింది.

అనంతరం ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మోర్గాన్, దినేష్ కార్తీక్ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. త్వరగా స్ట్రైక్ రోటెట్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మోర్గాన్ 15(10), దినేష్ కార్తీక్ 21(10), రాహుల్ త్రిపాటి 3(2) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కత్తా జట్టు ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

Chennai super kings Innings:

శుభ్‌మన్ గిల్ బౌల్డ్ b కరన్ శర్మ 26(17), సునీల్ నరైన్ 7(7) రవీంద్ర జడేజా b సాంట్‌నర్, రింకు సింగ్ 11(11) c అంబటి రాయుడు b రవీంద్ర జడేజా, నితీష్ రాణా 87(61), c సామ్ కరన్ b ఎంగిడి, మోర్గాన్ (c) 15(12) c రుతురాజ్ గౌక్వాడ్ b ఎంగిడి, దినేష్ కార్తీక్ 21(9) నాటౌట్, రాహుల్ త్రిపాటి 3(2) నాటౌట్

ఎక్స్‌ట్రాలు: 2

మొత్తం స్కోరు: 172/5

వికెట్ల పతనం: 53-1 (శుభమన్ గిల్- 7.2,) 60-2 (సునీల్ నరైన్- 8.3)
93-3 ( రింకు సింగ్- 12.5), 137-4 (నితీష్ రాణ-17.1), 167-5 ( మోర్గాన్, 19.2)

బౌలర్లు: దీపక్ చాహర్ 3-0-31-0, సామ్ కరన్ 3-0-21-0, లుంగీ ఎంగిడి 4-0-34-2, మిచెల్ సాంట్ నర్ 3-0-30-1, రవీంద్రజడేజా 3-0-20-1, కరణ్ శర్మ 4-0-35-1

Advertisement

Next Story

Most Viewed