- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..కరెంట్ వైర్ తగిలి యువకుడు మృతి
దిశ,పర్వతగిరి: మండలంలోని ఏనుగల్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో మెట్లు కట్టుతుండగా ఐరన్ రాడ్ అవసరం వచ్చి బయట ఉన్న ఐరన్ రాడ్ తీసుకు రావడానికి వెళ్లి ప్రమాదవశాత్తు 11 కేవీ వైరు తగిలి మాసాని దిలీప్ (20) మృతి చెందారు. పర్వతగిరి ఎస్ఐ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు మాసాని దిలీప్ తండ్రి రవి ఏనుగల్ గ్రామం చర్చి పక్కన గల తన ఇంట్లో మెట్లు కట్టుతుండగా ఐరన్ రాడ్ అవసరం వచ్చి బయట ఉన్న ఐరన్ రాడ్ తీసుకురావడానికి వెళ్లగా రాడ్ ని పైకి లేపేసరికి పైన ఉన్న 11 కేవీ వైరు ప్రమాదవశాత్తు ఆ రాడ్ కి తగలడం వల్ల కరెంట్ షాక్ కొట్టి హాస్పిటల్ కి తరలించారు.కాగా శనివారం సాయంత్రం మరణించినట్లు తెలిపారు. తండ్రి రవి ఇచ్చిన దరఖాస్తు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నిర్లక్ష్యపు నీడలో విద్యుత్ శాఖ అధికారులు..
పర్వతగిరి మండలంలోని రావురు గ్రామానికి చెందిన బండి సతీష్ ఇంటి పైన గ్రామానికి వెళ్లే విద్యుత్ లైన్ ఉండటంతో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడే లేడని వాపోతున్నారు.. చిన్న పిల్లలు, మహిళలు స్లాబ్ పైకి ఎక్కుతారని అనుకోకుండా జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి ఇంటి పై ఉన్న విద్యుత్ వైర్లను తీసివేసి నూతన లైన్లు నిర్మించి ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలని కోరుతున్నారు.