TG: సచివాలయ సంఘం ఎన్నికల ఫలితాలు విడుదల.. ప్రెసిడెంట్ ఎవరంటే?

by Gantepaka Srikanth |
TG: సచివాలయ సంఘం ఎన్నికల ఫలితాలు విడుదల.. ప్రెసిడెంట్ ఎవరంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ(Telangana Secretariat) సంఘం ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ప్రెసిడెంట్‌గా గిరి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్(జనరల్)గా నవీన్ కుమార్, మరో వైస్ ప్రెసిడెంట్‌గా (ఉమెన్) విజేత లావణ్య లత విజయం సాధించారు. ఇక జనరల్ సెక్రటరీగా ప్రేమ్(దేవేందర్), అడిషనల్ సెక్రెటరీగా రాము భూక్యా, జాయింట్ సెక్రెటరీ(పబ్లిసిటీ)గా రాజేశ్వర్, మరో జాయింట్ సెక్రటరీ (కల్చరల్)గా యామిని కనకతార, స్పోర్ట్స్ విభాగం జాయింట్ సెక్రటరీగా వంశీదర్ రెడ్డి, మహిళా విభాగం జాయింట్ సెక్రటరీగా నీరజాక్షి, ఆర్గనైజేషన్ విభాగం నుంచి కే.శ్రీనివాస రెడ్డి విజయం సాధించారు.

Advertisement

Next Story

Most Viewed