ఫరూఖ్ నగర్‌ పరిశ్రమలకు చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ సంచలన ఆదేశాలు

by Shyam |   ( Updated:2020-02-11 04:23:23.0  )
ఫరూఖ్ నగర్‌ పరిశ్రమలకు చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ సంచలన ఆదేశాలు
X

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్ నగర్ మండల పరిధిలో ఉన్న కందివనం, మొగిలిగిద్దల గ్రామంలోని పరిశ్రమలకు చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు సంచలన ఆదేశాలు జారీచేసింది. కాలుష్యాన్ని వదులుతూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పరిశ్రమలను వెంటనే మూసివేయాలని ఆదేశించింది. సదరు పరిశ్రమలపై వెంటనే విచారణ చేపట్టి, నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రంగారెడ్డి కలెక్టర్‌కు వెల్లడించింది. కాగా, ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యానికి సంబంధించిన నివేదికలను కె.ఎల్ రెడ్డి అనే రిటైర్డ్ ఆర్మీ అధికారి పలుమార్లు కలెక్టర్‌తో పాటు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో గ్రీన్ ట్రిబ్యునల్‌ కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించాలని గతంలోనే రాష్ట్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినప్పటికీ, ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు. దీంతో కోర్టు పై నిర్ణయం తీసుకుంటూ ఆదేశాలు జారీ చేసింది. చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాలతో కాలుష్య పరిశ్రమలను ఆర్డీవో, ఇతర అధికారులు తనిఖీ చేసి, వెళ్తుండగా, వారి వాహనాలను గ్రామస్తులు అడ్డుకుని, పరిశ్రమలు మూసివేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed